calender_icon.png 26 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

26-10-2024 01:41:00 AM

  1. మంత్రి జూపల్లి కృష్ణారావు
  2. సోమసిల నుంచి శ్రీశైలానికి ఏసీ లాంచ్ ప్రారంభం

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమసిల నుంచి శ్రీశైలం క్షేత్రానికి ఏర్పాటు చేసిన ఏసీ లాంచ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కాసేపు లాంచ్ డ్రైవింగ్ చేసి నదిలో విహరించారు.

ఆయన మాట్లాడుతూ.. కృష్ణానది సవ్వడులు, పకృతి అందాలు, వన్యప్రాణులను చూస్తూ భక్తులకు శ్రీశైల మల్లన్న దర్శనం చేయించేలా లాంచ్ ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సుమారు 120 కిలోమీటర్ల మేర ప్రయాణానికి 7గంటల వ్యవధి పట్టనుందని.. పెద్దలకు రూ.3వేలు, చిన్నారులకు రూ.1600 టికెట్టు ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఏసీ లాంచ్ ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు.