కాప్రా (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాస సోమవారం సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసి కాలనీలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు వేద పండితులు సురేష్ శర్మ, దిలీప్ శర్మ, అప్ప శర్మ, ఈవో శ్రీనివాసరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, మురళి పంతులు, జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్లు, పద్మ, దుర్గా, సిద్దిపేట శ్రీనివాస్ లతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.