30-04-2025 06:03:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy) అన్నారు. బుధవారం నిర్మల్ మండలంలోని ఎల్లెపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు మేడిపల్లి గ్రామంలో వరి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఆయా గ్రామాల్లో ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.