11-03-2025 01:05:26 AM
ఆదిలాబాద్, మార్చ్ 10 (విజయ క్రాంతి) : నూతనంగా ఏర్పడిన సిరికొండ మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో రూ. 20 లక్షలతో ఆరోగ్య ప్రాథమిక ఉప కేంద్రం భవన నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సిరికొండ మండలంలో కనీస మౌలిక వసతుల కల్పనలో భాగంగా 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. అదేవిధంగా 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ భూమిపూజ చేశామని తెలిపారు.
ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇచ్చోడ నుండి సిరికొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృసిచేస్తము అని అన్నారు అదేవిధంగా చిక్మెన్ ప్రాజెక్టు రీ డిజాన్ చేసి ప్రాజెక్టు ఎత్తు పెంచేవిధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.