calender_icon.png 19 March, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేట అభివృద్ధికి కృషి

19-03-2025 01:34:51 AM

రూ. 30 లక్షలతో ముస్లిం కబరస్తాన్ కు ప్రహరీ గోడ నిర్మాణం..

సదాశివపేట, మార్చి 18: సదాశివపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ కమిషనర్ ఉమా తెలిపారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని ముస్లిం కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ప్రభుత్వం ప్రహరీ గోడ నిర్మాణం కోసం 30 లక్షల నిధులు మంజూరు చేసింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి చోటు, ఎండి లతీఫ్, సజ్జి, లైక్, హాజీ, సాబీర్, అలీమ్, రహమత్, ఖదీర్, వాజిద్, వసీం తో పాటు నాయకులు పాల్గొన్నారు.