calender_icon.png 26 January, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

25-01-2025 12:00:00 AM

  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. 2.38 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 
  2. నూతన రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా ప్రారంభం

 పటాన్ చెరు, జనవరి 24 : అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్‌పూర్, ఐలాపూర్, ఐలాపూర్‌తాండ, దయారా పరిధిలో రూ.2.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం పటేల్ గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా  నిధులు కేటాయిస్తున్నామని తెలి పారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభి వృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని, విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటువుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.

మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిష నర్ జ్యోతిరెడ్డి, నాయకులు శ్రీకాంత్, చంద్రశేఖర్, మాణిక్ యాదవ్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.