జిల్లా గ్రంథాలయా బోర్డు చైర్ పర్సన్ చిలుముల సుహాసిన్ రెడ్డి..
రామాయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్ పర్సన్ చిలుముల సుహాసిన్ రెడ్డి సందర్శించారు. గ్రంథాలయంలోని వివరాలను పరిశీలించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ.. పలు పుస్తకాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆమె తెలిపారు. పాఠకులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.