calender_icon.png 22 December, 2024 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కృషి

07-10-2024 12:00:00 AM

మంత్రి శ్రీధర్‌బాబు 

అలంపూర్, అక్టోబర్ 6: దేవి శరన్నవ రాత్రుల సందర్భంగా అలంపూర్ జోగుళాం బ అమ్మవారు, బాల బ్రహేశ్వరస్వామి ఆల యాలను ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. జోగుళాంబ ఆ లయం అభివృద్ధి కోసం ఆర్కియాలజీ డిపా ర్ట్‌మెంట్ వారితో సంప్రదింపులు జరిపి కేం ద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామ న్నారు.

మంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, విజేయుడు, డీసీసీబీ చైర్మన్ మామిళ్ల విష్ణు వర్ధన్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసే నారెడ్డి, ఏఐసీసీ సంపత్‌కుమార్, గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత తదితరులు ఉన్నారు. 

పట్టు వస్త్రాలు సమర్పణ

జోగుళాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం తరఫున పట్టు వస్త్రాలను కలెక్టర్ రం జిత్ భాషా కుటుంబ సమేతంగా ఆదివారం అందజేశారు. ఆలయ అభివృద్ది కోసం ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఈవో పురేందర్ కుమార్ పాల్గొన్నారు.