09-03-2025 05:44:20 PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇందు సామ్రాజ్య స్థాపన కోసం సర్వస్వం అర్పించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుల అభివృద్ధికి కృషి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఆదివారం సిర్పూర్ మండలంలో ఆరే సంక్షేమ సంఘం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అరే కులస్తులు అత్యధిక శాతం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నారని రానున్న రోజుల్లో రాజకీయంగా వారికి సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సిర్పూర్, దహేగాం గ్రామాలలో 25 లక్షల రూపాయలతో సంఘ భవనాలను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆరె కులస్తుల ప్రధాన సమస్య ఓబిసితో పాటు శివాజీ జయంతి సెలవు దినోత్సవ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆరె కులస్తుల 30 సంవత్సరాల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.