calender_icon.png 17 October, 2024 | 9:04 AM

ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి

17-10-2024 12:10:23 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

పలు అభివృద్ధి పనుల ప్రారంభం

కుమ్రంభీంఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో కలసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

గుండి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి తరగతిని ప్రారంభించారు. జన్కాపూర్ జెడ్పీ పాఠశాల వద్ద సంచార విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. కుమ్రంభీం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వైద్యులను నియమిం చేందుకు కృషి చేస్తానని తెలిపారు. గుండి వాగు వంతెన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.

వాట్టివాగు ప్రాజెక్టును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని, ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీవో కుష్బుగుప్తా, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఆర్‌డీవో దత్తరావు పాల్గొన్నారు.