ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, డిసెంబర్ 1: అమీన్‌పూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. పటేల్‌గూడ సాయియాక్సిస్ హోమ్స్ కాలనీలో రూ.60లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అభివృద్ధిలో అంద రూ భాగస్వాములు కావాలని కోరా రు. కాగా రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10లక్షల సొంత నిధులను అందించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.