calender_icon.png 19 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రుల అభ్యున్నతికి కృషి

19-03-2025 02:12:07 AM

  1. వీరభద్రీయులు సామాజిక, ఆర్థికంగా, విద్యా పరంగా అభివృద్ధి చెందాలి
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 18: సామాజికంగా వెనుకబాటుకు గురైన వీరభద్రుల అభ్యన్నతి కోసం తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వీరభద్ర సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని కాన్సిట్యూష న్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సంఘం ఏర్పాటై 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందులోని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ‘ఏ’లో అత్యంత వెనుకబడిన కులంగా ఉన్న వీరభద్రీయులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు.

ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని చిరు వ్యాపారులు రుణాలు పొందొచ్చన్నా రు. పీఎం పథకం ఓబీసీ విద్యార్థులకు వరంలాంటిందని అభిప్రాయపడ్డారు.