13-03-2025 08:15:06 PM
భైంసా,(విజయక్రాంతి): పశు సంపాదన పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్( Bhainsa Agriculture Market Committee Chairman Anand Rao Patel) అన్నారు. మండలంలోని చుచుండు గ్రామంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ ఆధ్వర్యంలో పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు. కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు.