calender_icon.png 3 April, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి, మహిళా సాధికారతకు కృషి

29-03-2025 12:23:38 AM

అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్

ముషీరాబాద్, మార్చి 28: (విజయక్రాంతి): యువతకు ఉపాధితో పాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని   అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు.

ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత అప్ప జెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర శాఖ ఉగాది నుండి శిక్షణ తరగతులు, అలాగే యాదవ పిల్లలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 21న అఖిల భారత యాద వ మహాసభలను మధ్య ప్రదేశ్ ఓర్చలో, జూన్  నెలలో హైదరాబాద్  నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో మేకల లలిత, నీలం శ్రీనివాస్, సురేష్, రాకేష్ పాల్గొన్నారు.