calender_icon.png 13 March, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాభివృద్ధికి కృషి: డిడి రమాదేవి

12-03-2025 11:21:02 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం జిల్లా కేంద్రంలో గిరిజన బాలికల క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి(Tribal Welfare Department DD Ramadevi) అన్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా క్రీడా పాఠశాల ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ విజేతపాటు క్రీడారంగంలోనూ రాణించాలని తెలిపారు. జాతీయ రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ చూపడం జరుగుతుందని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ను సన్మానించారు. నాలుగు జిల్లాల నుండి 60 మంది నాలుగవ తరగతి, 5,6,7,8 వ తరగతి బ్యాక్ లెగ్ ల కోసం 80 మంది విద్యార్థులు హాజరైనట్లు గిరిజన క్రీడా అధికారి బండ మీనా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసి ఎం ఓ ఉద్ధవ్, ఏటీడీవో చిరంజీవి, ప్రధానోపాధ్యాయుడు జంగు , మంచిర్యాల క్రీడా అధికారి జీవరత్నం, పేట సెక్రెటరీ కృష్ణమూర్తి, పిడి మధుసూదన్, పీఈటీలు, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.