కాప్రా (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం సమగ్రభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామాని ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో 17 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనులను త్వరతిగత్తిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు ప్రాంతంలో చేపడుతున్న పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా స్థానిక పరిశీలించాలని ఆయన సూచించారు.
కుషాయిగూడలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలొ వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్, ఏఈ సందీప్, కుషాయిగూడ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాయకులు పండాల శివకుమార్ గౌడ్, వేమూరి మహేష్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పనగట్ల చక్రపాణి, చల్లా వెంకటేశం, శ్రీకాంత్ యాదవ్, చిత్తుల కిషోర్, పంజాల బాబు, జయకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, అనిల్ బాబు, కొడకండ్ల యాదయ్య, సప్పిడి వెంకట్ రెడ్డి, చిదం బాలనర్సింహా, నర్సింగ్ రావు, గణేష్ గౌడ్, దయానంద్, సారా శ్రీధర్, దినేష్, అంజన్న, మణి కిరణ్, శ్రీనివాస్, శ్రవణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.