కాప్రా (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ కు చెందిన వైష్ణవి ఎన్క్లేవ్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా కాలనీలలో డ్రైనేజ్ సమస్యలతో పాటు రహదారుల నిర్మాణం పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. వైష్ణవి ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చెయ్యనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గంప కృష్ణ, సిసిఎస్ ప్రతీనిధి పద్మారెడ్డి నాయకులు, గంగ ఈశ్వరయ్య, ఆది విష్ణుమూర్తి, సుమంత్, కార్తీక్, సంతోష్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.