calender_icon.png 22 December, 2024 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశుపోషక అభివృద్ధికి కృషి

21-12-2024 07:21:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో పశుపోషకదారులకు ప్రోత్సాహం అందించేందుకు పశువుల్లో కృత్రిమ గర్భాధారణ పశుగణాభివృద్ధి చర్యలు తీసుకుంటున్నట్లు పశువైద్యాధికారి ఓం ప్రకాష్ అన్నారు. శనివారం సోన్ మండల పాక్ పట్ల గ్రామంలో కృత్రిమ గర్భాదారణపై రైతులకు అవగాహన కల్పించారు. మేలు రకం పశుజాతులను ఎంపిక చేసుకున్నందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అధ్యక్షులు గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు.