calender_icon.png 26 March, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరికి కృషి జరుగుతోంది

25-03-2025 07:55:19 PM

సంఘాలకతీతంగా అర్హులైనవారందరికి న్యాయం చేస్తాం..

సాంకేతిక సమస్యను అధిగమించేందుకు ప్రతినిధి బృందంగా రాష్ట్ర పెద్దలను కలుద్దాం..

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరికి స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పాత కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో జర్నలిస్టులు చేపట్టిన వంటా వార్పు నిరసన శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ... జర్నలిస్టుగా పనిచేసిన కూనంనేని వారి ఇబ్బందులేంటో తెలుసని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించండం జరిగిందని గుర్తు చేశారు.

సంఘాలకతీతంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. స్థలాల కేటాయింపులో సాంకేతిక సమస్యలుంటే ప్రతినిధిబృందంగా కూనంనేని నేతృత్వంలో ప్రతినిధి రాష్ట్ర పెద్దలకు కలిసి పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, గెడ్డాడు నగేష్, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీనివాస్, పట్టణ నాయకులు మాచర్ల శ్రీనివాస్, కె ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణాచారి, నేరెళ్ల శ్రీనివాస్, దుర్గ, సియాద్రి నాగేశ్వర్ రావు, అజీజ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.