04-04-2025 12:36:03 AM
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
తిమ్మాపూర్ ఏప్రిల్ ౩ (విజయ క్రాంతి): మండల కేంద్రంలో నెలకోల్పిన మహనీ యుల విగ్రహాలను త్వరగా ఆవిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా ఎస్పీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తిమ్మాపూర్ పోలిటికల్ జేఏసీ కన్వీనర్లు వంతడుపుల సంపత్, మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య, ఎలుక ఆంజనేయులు, కనకం రాములు, మేడి అంజయ్య తదితరులు కలిసి మహనీయుల విగ్రహా లను త్వరగా ఆవిష్కరించేలా చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన ఆయన మాట్లాడుతూ సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, లు డిల్లీలో ఉన్నారని వాళ్ళు రాగానే మాట్లాడి ఆవిష్కరణ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు.