మానకొండూర్, జనవరి 8: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అల్గునూర్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అట్ల అనిల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ భూదురి దిష్టిబొమ్మను అలుగునూర్ ప్రధాన చౌరస్తాలో దహనం చేశారు.
“దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలకపాత్ర పోషించిన కుటుంబం నుంచి మొదటిసారిగా ఎంపీ అయిన ప్రియాంక పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. బీజేపీ ఎంపీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు, ఎల్కపెల్లి సిద్ధార్థ, తొర్తి అరవింద్, ఎండీ షారుక్, సముద్రాల అనిల్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, శానకొండ శరత్, జనగం ప్రణయ్, మహేష్ చంద్ర, మండల అధ్యక్షుడు కోండ్ర సురేష్, కర్ర మణికంఠ, అడేపు అజయ్, రాపోలు నవీన్, కర్రవుల సందీప్, మండల ఉపాధ్యక్షుడు ముక్కెర సతీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్, వినయ్, సాయి చరణ్, శ్రీకాంత్, సాయి, రాకేష్, అనిల్, ప్రవీణ్, అజయ్, శ్రీకాంత్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.