హైదరాబాద్ (విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జంగయ్య మాట్లాడుతూ.. అక్రమంగా రైతుల భూములను లాక్కోవడాన్ని నిరసించిన రైతులతో ప్రభుత్వం చర్చించాలి అన్నారు. ఇటీవల 16 మంది రైతులను అరెస్ట్ చేయడమే కాకుండా మద్దతుగా నిలిచిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక మని విమర్శించారు. ప్రభుత్వం బాధితులనే దోషులను చేస్తుందని ఆరోపించారు. తక్షణమే అరెస్ట్ అయిన రైతులను మాజీ ఎమ్మెల్యేను విడుదల చేసి రైతులతో చర్చించాలనీ డిమాండ్ చేశారు.