calender_icon.png 26 November, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

26-11-2024 05:45:59 PM

మంచిర్యాల (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. మంగళవారం వామపక్ష, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మిక చట్ట సవరణలు, వ్యవసాయ నల్ల చట్టాలు కేవలం మోడీ మిత్రుల కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టికర్తలైన కార్మికులను విస్మరించరాదని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

రైతు పండించిన పంట మీద హక్కు  లేకుండా చేసేటువంటి నల్ల చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అజ్మీరా లాల్ కుమార్, ఇప్టు జిల్లా కార్యదర్శి బ్రహ్మానందం, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి దేవరాజ్, ఏఐటీయూసీ నాయకులు ఖలిందర్ ఆలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, బి కే యం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, నాయకులు కుమార్, ఉమారాణి, ఇప్టు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి అందే మంగ, నాయకులు దొండ ప్రభాకర, చరణ్, లక్ష్మణ్, రమా దేవి తదితరులు పాల్గొన్నారు.