16-03-2025 08:18:33 PM
కొల్చారం (విజయక్రాంతి): గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ హోదాలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన గడ్డం ప్రసాద్ ను ఏక వచనంతో సంబోధించి శాసనసభ, సభ మర్యాదలను మంటగలిపిన బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆదివారం నాడు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యేల్లు గారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభ్యులు శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభ మర్యాదలను మంట గలుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మధుసూదన్ రెడ్డి ముత్యం గారి గోవర్ధన్ గోండా కృష్ణ మండలంలోని గ్రామాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.