calender_icon.png 16 March, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం

16-03-2025 04:21:47 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను స్థానిక గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. దళితులు అంటే బీఆర్ఎస్ కు చిన్న చూపు దళితులను అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ అవమాన పరుస్తుందని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.  అనంతరం వారు మాట్లాడుతూ... దళిత స్పీకర్ ని ఏక వచనంతో అవమానకరంగా, అసభ్యకరంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే దానికి కేటీఆర్ వత్తాసు పలకడం దళిత సామాజిక వర్గాలు గమనిస్తున్నాయని అన్నారు. గతంలో కేసీఆర్ అధికారం రాకముందు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడని లేకుంటే తన తల నరుక్కుంటానని ప్రకటించిన హామీని గుర్తు చేశారు.

అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అకారణంగా పదవి నుంచి తొలగించారన్నారు. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం కోసం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన మీరా కుమారులను నేరెళ్ల వచ్చినప్పుడు అరెస్టు చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల సంక్షేమ పార్టీ అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టి అంజయ్య ను ముఖ్యమంత్రిని చేసి దళితుల పట్ల ప్రేమను ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేసి దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ కున్న అంకితభావాన్ని రుజువు చేసిందన్నారు.

దళిత సామాజిక వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేకిగా ముద్ర పడిందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి,  మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ , కాంగ్రెస్  నాయకులు అబ్రబోయిన స్వామి, సీతారాం మధు, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, రామస్వామి గౌడ్, నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, సాయిలు, రమేశ్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఈశ్వర్ గౌడ్ నరేష్ ,కొండ అంజయ్య, షమీ, అబ్రబోయిన రాజేందర్ బాల్ రాజు, నాగారపు రాములు, నర్రాగుల లింగం మలేష్ యాదవ్, సుధాకర్, రాజయ్య, నయీమ్, రామ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్, మమ్మద్ హైమత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.