calender_icon.png 16 March, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

16-03-2025 05:47:06 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు దళిత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  దిష్టిబొమ్మ దహనానికి వ్యతిరేకంగా ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో కేసిఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలు దహనం చేసి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.