19-04-2025 06:42:00 PM
ప్రధాని మోదీని విమర్శించే స్థాయి మీకు లేదు ఖబర్దార్...
బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు పెదమం భరత్..
వేములపల్లి (విజయక్రాంతి): ప్రధాని మోడీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదనీ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమం భరత్(BJP Mandal Party President Pedamam Bharat) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని నార్కట్పల్లి అద్దంకి రహదారిపై అద్దంకి దయాకర్ అంజని కుమార్ యాదవుల దిష్టిబొమ్మను దానం చేసి మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ముద్దాయిలుగా ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ లను కాపాడుకోవడానికి బిజెపి నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గత 12 సంవత్సరాల కాల పరిపాలనలో అవినీతికి ఎటువంటి తావు ఇవ్వకుండా భారతదేశాన్ని కాపాడుతున్న మోడీపై విమర్శలు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
ప్రధాని మోడీ కుట్ర రాజకీయాలు చేసినట్లయితే దేశ ప్రజలు మూడోసారి కూడా పట్టం ఎందుకు కడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు చిర్ర సాంబమూర్తి యాదవ్, బిజెపి మండల పార్టీ కార్యదర్శి పెదమం ప్రసాద్, దళిత మోర్చా జిల్లా నాయకులు సోమయ్య, యువమోర్చా నాయకులు మళ్ళి కంటి రమేష్, నిమ్మరగోటి మహేష్, ఇరుగు దిండ్ల నరేష్ బీజేపీ నాయకులు కందాటి రమేష్ రెడ్డి, మజ్జిగపు రామ్ రెడ్డి, పెదమం వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, సతీష్, దుర్గ, ప్రదీప్, లింగరాజులు, పాల్గొన్నారు.