calender_icon.png 17 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతల దిష్టిబొమ్మ దహనం

17-03-2025 01:26:34 AM

రాజేంద్రనగర్, మార్చి16 (విజయక్రాంతి): స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నాయకులు డెయిరీ ఫామ్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి తో పాటు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరుల తీరును తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా వారు మారకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎల్బీనగర్‌లో నిరసన 

స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆదేశాలతో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఎల్‌బీనగర్‌లోని అంబేద్కర్- జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్పీకర్ గౌరవాన్ని, స్థానాన్ని కించపరిచే విధంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. అతడి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కుట్ల నర్సింహా యాదవ్, శశిధర్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్,

సత్యనారాయణ, జయపాల్ రెడ్డి, గణేశ్ నాయక్, నాయకులు రమేశ్ నాయక్, సాయి నికేష్, శశిధర్ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్, చెరుకు చిరంజీవి, బొంగు వెంకటేశ్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, నారాయణ గౌడ్, రాజేశ్వరి, అంతటి శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రమేష్ నాయక్, విజయ రంగ, మణి శ్రీ, మున్నా తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  గూడూరు భాస్కర్‌రెడ్డి

కడ్తాల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డంప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బీచ్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.  సందర్భంగా ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ దళిత స్పీకర్ గడ్డంప్రసాద్ ని అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు.

స్పీకర్ పదవికి భంగం కలిగేలా  జగదీశ్వర్ రెడ్డి మాటలు ఉన్నాయని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజకీయాలలో మరియు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అహంకార మాటలు మంచివి కావని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి బీఖ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, సేవాదళ్ మండల అధ్యక్షులు లక్ష్మయ్య, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, నాయకులు జాంగిర్ అలీ, సత్యం యాదవ్, చందోజి, హిరాసింగ్, కృష్ణ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.