* ప్రతిభను చూసి పదవులు ఇస్తాం
* పార్టీ కోసం మా అన్నయ్య కూడా నిలబడ్డారు
* నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందన
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాజకీయాల్లో పని తీరే ప్రామా ణికమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. తనతో కలిసి పనిచేసిన వారిని గుర్తించే బాధ్యత తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై స్పందించారు.
తమకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా నాగబాబు సొంతంగా ఎది గారని గుర్తు చేశారు. పార్టీ కోసం నాగబాబు తనతో సమానంగా పనిచేశారని.. వైసీపీ నేతలతో తిట్లు కూడా తిన్నారన్నారు. మనోహర్, హరిప్రసాద్ కూడా పార్టీ కోసం పనిచేశారని.. ప్రతిభను చూసి పదవులు ఇస్తామని స్పష్టం చేశారు.
నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నా కుదరలేదని.. ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని చెప్పా రు. మంత్రి పదవి విషయం తర్వాత చర్చిస్తామని చెప్పారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని.. పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చినట్టు తెలిపారు. రాజకీయాల్లో కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలన్నారు.