calender_icon.png 11 October, 2024 | 6:51 PM

Breaking News

కార్యదక్షత

09-10-2024 12:00:00 AM

శోభావశేన వ్యాయామం 

భద్రం మందం చ కారయేత్

మృగ సంకీర్ణ లింగం చ 

కర్మస్వృతి వశేన వా॥

- కౌటిలీయం (చాణక్య: 2-31)

“భద్రం, మందం, మృగం అనే ఏనుగుల జాతులకు, ఆ మూడింటి సంకీర్ణ లక్షణాలున్న వాటికీ, వాటి స్వరూప స్వభావాదులనుబట్టి శిక్షణ ఇవ్వాలి” అని అంటారు ఆచార్య చాణక్య. ఏనుగులు అనేవి సంస్థలో ఉద్యోగులకు ప్రతీకలు. సంస్థ ఉజ్వలంగా ఎదగాలన్నా, పతనమై పోవాలన్నా అందులో పని చేసే ఉద్యోగులే కారణమవుతారు.

ముఖ్యంగా ఉన్న తోద్యోగుల పని తీరు, అంకితభావం, నైపుణ్యాలు, నిర్వహణా దక్షత, నిర్ణయాలు తీసుకునే విధానమే సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచేందుకు కారణమవుతుంది. ఉద్యోగుల నిర్వహణా స్థా యిని, సామర్థ్యాన్ని, నిబద్ధతను తెలుసుకోకుండా బాధ్యతలను అప్పగిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమవుతుంది.

‘కార్యసాధనలో సామ ర్థ్యం ప్రాతిపదికగా ఉద్యోగులను ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి ఉద్యోగులుగా’ భారతం చెపుతుంది. ఉద్యోగుల సామర్థ్యం కూడా సమయ సందర్భాలనుబట్టి మారవచ్చు. వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలు చిన్నవైనా సంస్థ ఉనికినే ప్రశ్నించవచ్చు. అందు కే, వారి నిబద్ధతను, వ్యక్తిత్వాన్ని నిశితంగా పరిశీలించి ‘సరైన పనికి సరైన వ్యక్తి’ని ఎన్నుకొని, అర్హత ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించాలి.

అలాంటి వారికి అవసరమైన శిక్షణను అందించే నాయకుడు తప్పక విజయాన్ని సాధిస్తాడు. నాయకుడు ఉద్యోగార్థుల వ్యక్తిత్వా న్ని, ప్రవర్తనను, బలాబలాలను కొన్ని నెలలు నిశితంగా పరిశీలించాకే వారికి తగిన బాధ్యతలను అప్పగించాలన్నమాట.

ఒక కార్యంలో విజయాన్ని సాధించిన ఉద్యోగి మరొక కార్యంలో అపజయం పాలు కావ చ్చు. అంతేకాదు, సందర్భం కూడా జయాపజయాల నిర్ణయంలో ముఖ్యభూమికను పోషిస్తుంది. అలాగే, ఒక సమయంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయని ప్రతిసారి అలాంటి నిర్ణయాలు ఫలితాలను ఇవ్వక పోవచ్చు. 

బాధ్యత అప్పగింత ఒక కళ

బాధ్యత అప్పగింత అనేది ఒక కళ. దానిని అభ్యసించలేని నాయకుడు ఎప్పుడైనా అపజయం పాలవుతాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వూ చూంగ్ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం. సంవత్సరంలో దాదాపు 200 రోజులకు పైగా విదేశాలలో వ్యాపార పనుల నిమిత్తం తిరుగు తుంటారాయన. తనకు వ్యక్తిగత సహా యకునిగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక అభ్యర్థిని నియమించుకుం టారని తెలుస్తున్నది.

పేరు గాంచిన విశ్వవిద్యాలయాలలో ఉత్తమ ఫలితాలు సాధిం చిన అభ్యర్థుల నుంచి చూంగ్ ఉన్నతోద్యోగులు అయిదుగురిని ఎంపిక చేసి ఆయన వద్దకు పంపిస్తారు. వాళ్లలోంచి ఒకరిని ఆయనే వివిధ పరీక్షల అనంతరం నియమించుకుంటారు. ఆ అభ్యర్థి ఆ స్థానంలో మూడు సంవత్సరాలు పని చేస్తాడు.

ఆ మూడేళ్లూ ఉదయ మే చూంగ్‌కు ఆరోజు కార్యనిర్వహణా నివేదికను సమర్పించడంతో పని ఆరంభమై, అర్ధరాత్రి వరకూ ఊపిరి సలపని రీతిగా ఉంటుంది. వివిధ స్థాయిలలో నిర్ణయాలు తీసుకోవడం సహా అన్ని ముఖ్య కార్యక్రమాలలోనూ అతను భాగస్వామిగా ఉంటాడు. చూంగ్‌తో విదేశాల కూ వెళ్ళాల్సి ఉంటుంది.

చూంగ్ లగేజీని తీసుకు వెళ్ళ డం దగ్గరి నుంచి మీటింగులలో నోట్స్ రాసుకోవడం, తదుపరి వివిధ విభాగాల నుండి అవసరమైన సమాచారం తెప్పించుకోవడం, వాటిని విశ్లేషించి, నివేదికలుగా చూంగ్‌కు సమర్పించడం వరకూ అన్నీ ఆ వ్యక్తిగత సహాయకుని బాధ్యతగానే చెబుతున్నారు.

ఇలా అంతటి తీవ్రమైన పనికి సంబంధించిన వివిధగతులలో శిక్షణను పూర్తి చేసు కున్న అభ్యర్థిని, అతని కోరిక ప్రకారమే ఉన్నత చదువులకు పంప డం లేదా ఒక విభాగానికి కార్య నిర్వహణాధికారిని చేయ డం జరుగుతుందని తెలుస్తున్నది.

ఒక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, పని తీరును, నిబద్ధతను, నైపుణ్యాలను, సహనాన్ని, ఒత్తి డిని తట్టుకునే శక్తినీ, శీలాన్ని నిశితంగా పరిశీలించి, పరీక్షించి బాధ్యతలను అప్పగిం చ డం ద్వారా నాయకుడు తన సమయాన్ని ఉత్పాదక రంగాలవైపు వెచ్చించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు సమర్థులైన రెండవ తరం నాయకులూ లభిస్తారు.

 పాలకుర్తి రామమూర్తి