పలు రైళ్ల దారి మళ్లింపు
ప్రయాణికులు విజయవాడకు తరలింపు
హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): ఏపీ, తెలంగాణలో వర్షాల ప్రభావంతో రైలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. తెలంగాణ, ఏపీ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తలెత్తాయి. వర్షాల ప్రభా వంతో ద.మ. రైల్వే పరిధిలోని 80 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా... 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 49 రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ఈ నేపథ్యం లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
వర్షాలతో అనేక చోట్ల రాకపోకలకు అంతరా యం ఏర్పడిందన్నారు. ఈ మేరకు రైల్ నిలయంలో అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. కేసముద్రం, ఇంటికన్నె, తడ్ల పూసపల్లి, మహబూబాబాద్ మధ్య, విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేష న్‌లో ట్రాక్ నీట మునిగిపోవడంతో అనేక రైళ్లను రద్దు చేయడం లేదా మళ్లించారు. ఇంటికన్నె వద్ద ట్రాక్ పునరుద్ధరణకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టా రు. కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ గుంటూరు సికిం ద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యా యి. కొన్ని రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు. పరిస్థితులను బట్టి రైళ్ల నియంత్రణ కోసం రైల్వే పలు చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు, ప్రయా ణికులకు సాయమందించేందుకు సికింద్రాబాద్, సికింద్రాబాద్, గుంటూరు, డివిజనల్ కార్యాలయాలలో అత్యవసర హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
విజయవాడలో సీనియర్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం 24 గంటలు బందోబస్తు నిర్వహించింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో విజయవాడ డివిజన్‌లోని సీనియర్ అధికారులు రాయనపాడు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షించారు. భారీ వర్షాలు, వరద నీటి విడుదలను సకాలంలో అంచనా వేయడానికి స్థానిక రాష్ర్ట ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు జీఎం తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రాయనపాడు స్టేషన్‌లో చిక్కుకుపోయిన రైలు నుండి ప్రయాణికులను తరలించడంలో సహాయం అందించాయి.
హెల్ప్-లైన్ సెంటర్ల్ల ఏర్పాటు..
వివిధ రైళ్ల రాకపోకల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పు డు తెలియచేసేందుకు ద.మ.రైల్వే ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిం ది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమం డ్రి, గుంటూరు, నరసరావుపేట, నల్గొండ, మిర్యాలగూడ, నంద్యాల, దొనకొండ, నడికుడి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూ రు డివిజన్లలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వేశాఖ వెబ్‌సైట్‌లో, సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరిచామని అధికారులు పేర్కొన్నారు.
ప్రయాణికులకు ఆహారం..
వివిధ రైల్వే స్టేషన్లలో ఆగిపోయిన రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకులు అక్కడ ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలు అందించారు. ప్యాంట్రీ కార్ సౌకర్యం లేని రైళ్లలోని ప్రయాణికుల కోసం ప్లాట్‌ఫారమ్ క్యాటరింగ్ స్టాల్స్ నుండి స్నాక్స్, ఫుడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ల సహాయం కూడా ప్రయాణికులు ఎంతో ఉపయోగపండిందని అధికారులు తెలిపా రు. రైలు నెం. 12622 చెన్ను సెంట్రల్‌కి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును రాయనపా డు స్టేషన్‌లో ఆపేశారు.
చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అల్పాహారం, వాటర్ బాటిల్స్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్, టీలను ఏర్పా టు చేశారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేశారు. దానాపూర్ నుంంచి బెంగళూరు వెళ్లే సంగమిత్ర ఎక్స్‌ప్రెన్‌ను కేస ముద్రం స్టేషన్‌లో నిలిచిపోయింది. ప్రయాణికులకు అల్పాహారం, వాటర్ బాటిళ్లు, టీ, వెజిటబుల్ బిర్యానీ తదితర సౌకర్యాలు కల్పించారు. ట్రాక్ దగ్గర నీటి మట్టాలు తగ్గిన వెంటనే ఈ రైళ్లను పట్టాలెక్కించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
రైలు నం.12728 సికింద్రాబాద్8 -విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ భారీ వర్షాల కారణంగా కొండపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ప్రయాణికులను రాయన్‌పాడు నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశా రు. దాదాపు 1,500 మంది ప్రయాణికులు ప్రత్యేక రైలులో బయలుదేరారు. న్యూఢిల్లీ చెన్ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రాయనపాడు నుంచి విజయవా డకు ఆర్టీసీ బస్సుల ద్వారా విజయవాడుకు తరలించి చెన్నైకు వైపు ప్రత్యేక రైలును ఏర్పా టు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్ను వెళ్లే రైలు నంబర్ 12760 చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను కొండపల్లి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించి చెన్ను వైపు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 50 ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఛార్జీల వాపసు..
పూర్తిగా రద్దు చేసిన, పాక్షికంగా రద్దు చేసిన రైళ్లకు సంబంధించి రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి రీఫండ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయిన లేదా రీషెడ్యూల్ చేయబడిన రైళ్లకు సంబంధించిన చెల్లింపుల కోసం స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపా రు. ఆన్‌లైన్ మోడ్‌లో తమ టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీల పూర్తి వాపసు ఆన్‌లైన్ ద్వారానే పూర్తవుతుందన్నారు.
వివిధ స్టేషన్లలో రైళ్లు నిలి చిపోయినందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిపై స్టేషన్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌ల ద్వారా తెలియచేస్తున్నారు. అదన పు విచారణ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి అధికారులు, సిబ్బందిని ప్రధాన స్టేషన్‌లలో నియమించారు.
యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ
వందేభారత్ వేళల్లో మార్పు
మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె - కేసముద్రం మధ్య కోతకు గురైన రైల్వే ట్రాక్ పనులను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా రు. ఆదివారం సాయంత్రం పక్కకు ఒరిగిన ట్రాక్‌ను సరిచేయడంతోపాటు బలా స్ట్ వేసి ట్రాక్ కట్టను పటిష్టం చేసే పనులను చేపట్టారు. విరిగిన విద్యుత్ పోల్స్ ను బిగించారు. అర్ధరాత్రి వరకు ట్రాక్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి నల్లగొండ మీదుగా తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు వేళల్లో మార్పు చేశా రు. సోమవారం షెడ్యూల్ ప్రకారం ఉద యం 6.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 5 గంటలు ఆలస్యంగా ఉద యం 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. న్యూఢిల్లీ, నాగపూర్, నాందేడ్, గోరఖ్‌పూర్, విశాఖపట్నం, గుంటూరు, విజయ వాడ, తిరుపతి, హౌరా, మైసూరు, బెంగళూరు, చెనై, కాకినాడ, ఖాత్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయంగా మరికొన్నింటిని దారి మళ్లించారు.
రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు..
హైదరాబాద్ 27781500
సికింద్రాబాద్ 27786140, 27786170
కాజీపేట 27782660, 8702576430
వరంగల్ 27782751
ఖమ్మం 27782985, 08742-224541,
7815955306
విజయవాడ 7569305697
రాజమండ్రి 0883-2420541
0883-2420543