calender_icon.png 18 November, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భధారణపై కాలుష్య ప్రభావం

05-11-2024 12:00:00 AM

దీపావళి పండుగ తర్వాత వాయుకాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. దీంతో గర్భిణులు, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఈవిషపు గాలిలో గర్భిణులు ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. గాలి కాలుష్యం తల్లి పిండంపై ప్రభావం చూపుతున్నట్లు తేలింది.

ఇది నవజాత శిశువుల గుండె, మెదడు, ఊపిరితిత్తులకు ప్రాణాంతకం. గర్భిణీలపై కాలుష్య ప్రభావంపై దేశంలో పెద్దగా పరిశోధనలు జరగలేదని, అయితే గర్భధారణ సమయంలో వాయుకాలుష్యానికి గురికావడం వల్ల ప్రీ మెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని కారణంగా, పిల్లల రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందదు.