calender_icon.png 21 September, 2024 | 3:20 AM

ఆవర్తన ప్రభావం.. రెండురోజులు వర్షాలు

21-09-2024 12:47:37 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని వల్ల శని, ఆదివారాల్లో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉత్తర అండమాన్ వైపు ఆవర్తనం కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.