calender_icon.png 4 October, 2024 | 1:03 PM

ఈశా ఫౌండేషన్‌కు ‘సుప్రీం’లో ఊరట

04-10-2024 01:28:01 AM

మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫౌండేషన్ క్యాంపస్‌లో పోలీసుల సోదాలను వెంటనే నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చింది. ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసు ల వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్టే ఆర్డర్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. 

ఈశా యోగా కేంద్రంలో తన ఇద్దరు కుమార్తెలు గీత (42), లత (39) యోగా నేర్చుకునేందుకు చేరగా.. వారిని పదేళ్ల్లుగా ఆశ్రమంలో బంధించి వారిని సన్యాసులుగా తయారుచేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా చేశారని.. కనీసం తమను కూడా ఆశ్రమంలోకి రానివ్వడం లేదని, నా ఇద్దరు కూతుర్లు నా వద్దకు రావడానికి ఇష్టపడని స్థాయికి తీసుకువచ్చారని తమిళనాడులోని అగ్రికల్చర్ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజు తీవ్ర ఆరోపణలు చేశారు.