13-03-2025 12:06:16 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక తాళ్లగొమ్మూరు విద్యుత్ ఉపకేంద్రంలో అదనపు ట్రాన్స్ ఫార్మర్ ను ఈఈ మహేందర్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయటానికి సుమారు రూ 1.50 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ఈ ప్రాంత వాసులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించడానికి తాము కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడి కె.జీవన్ కుమార్, బి వెంకటేశ్వర్లు,జె. రాంబాబు,టి. వేణు,ఉపేందర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.