calender_icon.png 23 October, 2024 | 1:46 PM

ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా ఈదురు వెంకన్న

07-08-2024 03:04:22 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తమ సమస్యల సాధనకు ఆర్టీసీ కార్మిక సంఘా లు ఏకగ్రీవంగా ముందుకు సాగుతాయని ఆర్టీసీ జేఏసీ నూతన చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తామం తా జేఏసీగా ఏర్పాటై భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమైనట్టు వెల్లడించారు.

మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూ ర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియ న్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ యూనియన్లు.. ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నను జేఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నాయి.

వైస్ చైర్మన్‌గా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, కన్వీనర్‌గా నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానా, కో కన్వీనర్లుగా బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేశ్, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి బీ యాదగిరిని ఎన్నుకున్నట్టు ఈదురు వెంకన్న తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించామని, తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.