calender_icon.png 6 February, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11న ‘ఎదురు చూపులు’ ఆవిష్కరణ

09-12-2024 12:00:00 AM

కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురితమైన ‘ఎదురు చూపులు’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో 11న జరగనుంది. సాహితీ వేత్త డా. వోలేటి పార్వతీశం పుస్తకాన్ని ఆవిష్కరించే ఈ సభకు ‘నేటి నిజం’ సంపాదకులు బైస దేవదాసు అధ్యక్షత వహిస్తారు.

డా. వై.రామకృష్ణారావు, గుదిబండి వెంకటరెడ్డి, డా. పులివర్తి కృష్ణమూర్తి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, కొసరాజు రాజేంద్రప్రసాద్, పొత్తూరి జయలక్ష్మి అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాహితీ కిరణం’ సౌజన్యంతో ‘కన్నవారి కలలు  -పిల్లల బాధ్యతలు’ అంశంపై నిర్వహించిన కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది.

 పొత్తూరి సుబ్బారావు