calender_icon.png 11 March, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

02-02-2025 06:57:59 PM

పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.  జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. ముందుగా అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయలు, చెక్ డ్యామ్ లో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు. పలువురు భక్తులు వాహనాలకు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి దీవించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు:

ఏడుపాయల వనదుర్గ భవాని మాతను ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ముందుగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా. ఏ శరత్ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.