calender_icon.png 23 November, 2024 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాల సౌకర్యాలతో విద్యా బోధన

22-11-2024 06:36:55 PM

పాల్వంచ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు సకల సౌకర్యాలతో విద్యాబోధన అందించి, వారికి ఉన్నత చదువులు చదవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ న్యాక్ బృందానికి తెలిపారు. శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో పర్యటనకు వచ్చిన న్యాక్ బృందానికి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలకు  సంబంధించిన అంశాలను ఆయన వారికి వివరించారు.

గురుకులం డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి మెనూతో పాటు నిష్ణాతులైన ఫ్యాకల్టీలతో విద్యాబోధన, ల్యాబరేటరీ సౌకర్యం కంప్యూటర్ శిక్షణ సమయానుకూలంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు విశాలమైన ఆటస్థలం, సైన్స్ ల్యాబ్ విద్యార్థినిల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థినీ విద్యార్థులు జేఈఈ నెట్ ఎంసెట్ కోచింగ్ కొరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని, అలాగే ర్యాంక్ వచ్చినవారు వివిధ రాష్ట్రాలలో ఇంజనీరింగ్ డాక్టర్లుగా చదువుతున్న విద్యార్థినిలకు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయము అందిస్తున్నామన్నారు.

ప్రతి నెల విద్యార్థినిల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థినిల చదువు పట్ల వారి మేధాశక్తి పట్ల ఉన్న పరిజ్ఞానాన్ని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందన్నారు. విద్యార్థినిలకు, వారి ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి సమస్యలు వచ్చిన 24 గంటలు పని చేసేలా ఏఎన్ఎంలను పర్యవేక్షణ కొరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఈ కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అన్ని వసతులు కల్పించి మంచి విద్యాబోధన గావిస్తున్నామని ఆటవిడుపుగా విద్యార్థినీలను విహారయాత్రలకు తీసుకొని వెళ్లడం కూడా జరుగుతుందని ఆయన వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిఓ గురుకులం నాగార్జున రావు, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, న్యాక్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.