calender_icon.png 6 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7, 8, 9 తేదీల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

04-01-2025 02:15:29 AM

మహబూబ్ నగర్, జనవరి 3 (విజయ క్రాంతి) : జిల్లాలో రాష్ర్ట స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు అవకాశం లభించిందని జిల్లా గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర  బోయి అన్నారు.

శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం సమాణవేశ మందిరంలో జరిగిన ఇన్స్పుర్ రాష్ర్ట స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన  కమిటీల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ర్ట స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈనెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించే అద్భుతమైన అవకాశం లభించిందని, రాష్ర్టంలోని 33 జిల్లాల విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొంటున్నందు వల్ల ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వసతి, రవాణా, పార్కింగ్ వంటి ప్రధానమైన విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. జడ్చర్లలో ని పోలేపల్లి సెజ్ లో ఉన్న ఎస్.బి.కె.యం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 7,8,9 తేదీలులో రాష్ర్ట స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమ న్వయంతో కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్డ్ సూచిం చారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ నిరంతరం కార్యక్రమాలను పర్యవే క్షిస్తారని, ఈ కార్యక్రమం నిర్వహణకు 25 కమిటీలు ఏర్పాటు చేసినట్లు, ఈ కమిటీలలో వివిధ శాఖల అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు  రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి 2500 మంది విద్యార్థులు గైడ్ టీచర్లు సైన్స్ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

జిల్లా పేరును గుర్తుంచుకునేలా ఏర్పాట్లు ఉండాలని, ఎక్కడ రాజీపడకుండా ఏర్పాట్లు అద్భుతంగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

్ర