జనవరి 21, 22 తేదీల్లో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25(విజయక్రాంతి): స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై జనవరి 21, 22 తేదీల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెచ్‌వోడీ డా.సయ్యద్ నజిఉల్లా తెలిపారు. ‘సస్టునబుల్ డెవలప్‌మెంట్ గోల్స్: రోల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పేపర్లు ఆఫ్‌లైన్‌లో మాత్ర మే సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు dopa internationalconference25@gmail.comకు ఇంగ్లిష్, ఉర్దూ పేపర్లను పంపవచ్చన్నారు. వ్యక్తిగత పేపర్లు డిసెంబర్ 1లోగా, ఆన్‌లైన్‌లో 20లోగా సమర్పించాలని చె ప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదని.. మరిన్ని వివరాలకు కాన్ఫరెన్స్ కోకన్వీనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అహ్మద్జ్రా 9873770067లో సంప్రదించాలని సూచించారు.