calender_icon.png 26 December, 2024 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో విద్యాభివృద్ధి

03-12-2024 01:06:47 AM

రూ.100 కోట్లతో  కోదాడలో రోడ్ల అభివృద్ధి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గంలో అధు నాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పద్మావతితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

రూ.25 కోట్లతో మోతె డబుల్ రోడ్డు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పట్టణంలో లారీ ఆఫీస్ నుంచి కొమరబండ వై జంక్షన్ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రైతుల కోసం అన్ని ఇరిగేషన్ లిఫ్ట్‌లు సక్రమంగా పనిచేసేలా మరమ్మతులు చేయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

తాగు, సాగు నీరుతో పాటు ఇంటర్నల్ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటీ చేసిందన్నారు. గత పదేళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం దిద్దుబాటు చర్య లు చేపట్టి నోటిఫికేన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది ప్రజాపాలన పూర్తికావడం సంతోషంగా ఉంద న్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నేరుగా ఖాతా ల్లో జమ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మె ల్యే చందర్‌రావు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో సూర్యనారాయణ, ఏసీపీ నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, లక్ష్మీనారాయణరెడ్డి ఉన్నారు.