25-02-2025 07:49:55 PM
ఉత్తమ విద్యార్థికి ప్రథమ లక్షణం క్రమశిక్షణ..
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బివిఎస్ఎల్..
చర్ల (విజయక్రాంతి): ప్రతి విద్యార్దికి క్రమ శిక్షణతో కూడిన విద్య అందించడం ఎంతో అవసరమని వనవాసీ కళ్యాణ పరిషత్ గౌరవ అద్యక్షులు, విశ్రాంత ప్రదానోపాద్యాయులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు. చర్లకు చెందిన ప్రముఖ వస్ర్తవ్యాపారి గాదంశెట్టి నరసింహారావు - ప్రసన్న లక్ష్మి దంపతులు వారి తల్లిదండ్రులు గాదంశెట్టి బాలనర్సింహం - చెంచులక్ష్మి ల జ్ఞాపకార్థం వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు మంగళవారం భీరువాను వితరణగా అందచేసారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యార్దులకు భోజనం, మిఠాయిలు, అరటిపండ్లను అందచేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బివిఎస్ఎల్ నర్సింహారావు మాట్లాడుతూ... విద్యార్దులు దాతలు అందచేసిన సహకారం సద్వినియోగ పరుచుకోవాలని విజ్ఞప్తి చేసారు.
ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని, విద్యద్వారా జీవితాలను సుస్దిరం చేసుకోవచ్చని అన్నారు. విద్యార్దులు శ్రద్దతో చదివి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలన్నారు. విద్యకు గల ప్రాదాన్యతను గుర్తించి దాతలు అందచేస్తున్న సహకారం మరువ లేనిదన్నారు. నర్సింహారావు - ప్రసన్నలక్ష్మి దంపతులు ఇటీవల తమ పెద్దల జ్ఞాపకార్థం రూ. 26 వేల వ్యయంతో బియ్యం, పరుపులు, కిటికీ గ్రిల్స్ అందచేసిన విషయాన్ని గుర్తుచేసారు. మరోమారు విద్యార్దులపై మమకారంతో బీరువాను అందించడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఆదివాసీ విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దాత గాదంశెట్టి నర్సింహారావు, నిలయకమిటి బాద్యులు గొంది శోభన్‌బాబు, జవ్వాది మురళీకృష్ణ, గోగికార్ రాంలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, గొంది ప్రసన్నకుమారి, విద్యార్దులు పాల్గొన్నారు.