calender_icon.png 15 November, 2024 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో విద్యావ్యవస్థదే కీలక పాత్ర

09-08-2024 01:01:02 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వెల్లింగ్‌టన్ (న్యూజీలాండ్), ఆగస్టు 8: రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తామని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లగ్జన్ సంయుక్త ప్రకటన చేశారు. ముఖ్యంగా విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తామని ఉద్ఘాటించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము న్యూజీలాండ్‌కు గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాయల్ గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతం పలికింది న్యూజీలాండ్. అనంతరం న్యూజీలాండ్ గవర్నర్ జనరల్ డేమ్ కిండీ కీరో, ఉపప్రధాని విన్‌స్టన్ పీటర్స్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల సహకారంపై వీరు చర్చించారు. వెల్లింగ్టన్‌లో నిర్వహించిన న్యూజీలాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ముర్ము ప్రసంగించారు. 21వ శతాబ్దంలో భారత్‌లో విద్యావ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. న్యూజీలాండ్ తన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థకు ప్రసిద్ధిగాంచిందని ప్రశంసించారు.