calender_icon.png 6 October, 2024 | 4:51 PM

పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి పొన్నం

06-10-2024 02:48:48 PM

హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోపే భవనాలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బదిలీలు పూర్తి చేసి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. గత పదేళ్లలో విద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. గురుకులాల్లో 98 శాతం పాస్ పర్సెంటేజ్ ఉందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్ ల అంశంపై ఆదివారం ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.