బీఆర్‌ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడి యా సమావేశంలో మాట్లాడుతూ ఫీజు రియెంబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కళాశాలలకు చెల్లించలేదన్నారు.
ప్రైవేట్ కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఒక్క సమావేశం నిర్వహించలేదని మండిపడ్డారు. విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు పత్తా లేదని విమర్శించారు.