calender_icon.png 23 February, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ యజమాన్యాల చేతుల్లో బందీగా విద్యావ్యవస్థ..

23-02-2025 05:35:55 PM

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట దాస్..

ఘనంగా డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావం..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ఓయూ ప్రొఫెసర్ వెంకట దాస్ అన్నారు. విద్యారంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రభుత్వ రంగంలోనే విద్యా కొనసాగాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో డెమోక్రెటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డీఏటీఏ) ఆవిర్భావ సభ అధ్యక్షులు డా.మోహినొద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎంఎన్.నర్సయ్య, అధ్యాపకురాలు రజిత, ఓయూ ప్రొఫెసర్ శోభలతో కలిసి ఓయూ ప్రొఫెసర్ వెంకట దాస్ లతో కలసి అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి నాణ్యమైన, నైపుణ్యత ఉన్న విద్యాను అందించే లక్ష్యంగా డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించడం ఆనంద దాయకం అని తెలిపారు. యూజీసీ, ఏఐసీటీ, ఎఫ్సీఆర్సీ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ యజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ నైపుణ్య విద్యను అందించడంలో విఫలం చెందుతున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అనేక రుగ్మతలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు గణేష్, డా.సీతారాం, ప్రధాన కార్యదర్శి డా.ఉపేంద్ర కుమార్, కోశాధికారి ఓరుగంటి రమేష్, సంయుక్త కార్యదర్శులు కుమార్, అమరనాథ్, మల్లేష్(పెరియార్ ఎడ్యుకేషన్ సొసైటీ) తదితరులు పాల్గొన్నారు.