calender_icon.png 2 November, 2024 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యే ఆయుధంగా ఎదగాలి

13-05-2024 02:42:04 AM

ఇంటర్మీడియట్ విద్యాశాఖ మాజీ అధికారి రఘు

పది, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన 

గంగపుత్ర విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

నిజామాబాద్, మే 12(విజయక్రాంతి): గంగపుత్ర విద్యార్థులు విద్యను ఆయుధంగా మలుచుకుని జీవితంలో పైకి ఎదగాలని, ఇందుకోసం ప్రణాళికాబద్ధమైన శ్రమ, అంకితభావంతో కృషి చేయాలని నిజామా బాద్ మాజీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ సూచించారు. పది, ఇంటర్మీడియ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గంగపుత్ర విద్యార్థులకు తెలంగాణ గంగపు త్ర సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. పదో తరగతిలో 9, ఆపైన జీపీఏ సాధించినవారు, ఇంటర్మీడియట్‌లో 900 మార్కులకు పైగా సాధించిన దాదాపు 200 మంది గంగపుత్ర విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణా గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నీలి రాంచందర్ మాట్లాడుతూ.. సంఘం తరపున గంగపుత్ర విద్యార్థులను ప్రోత్సహి ంచలన్న ఉద్దేశంతో కొద్ది సంవత్సరాలుగా పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ పురస్కారాలు విద్యార్థులను ఉన్నత లక్ష్యం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణా గంగపుత్ర సంఘం చేపట్టిన ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని రఘురాజ్ అభినందించారు. ఈ కార్యక్ర మంలో గంగపుత్ర సంఘం కార్యదర్శి ఎల్లుల్ల లింగం, ఉపాధ్యక్షులు బింగి పెంట య్య, శంకర్, మునిరాజు, పందిరి స్వామి, కోశాధికారి శాస్త్రీ శంకర్‌తో పాటు  తదితరులు పాల్గొన్నారు.