17-04-2025 12:25:08 AM
కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : హయత్ నగర్ లోని ఎల్లారెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పా టు చేసిన లండన్ కిడ్స్ ప్లే స్కూల్‌ను బుధవారం హయత్ నగర్, మన్సూరాబాద్ డివి జన్ కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు నవజీవన్ మాట్లాడు తూ.. పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు.
పిల్లలకు చిన్నతనం నుంచే మన పండుగల పట్ల, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాట లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళ్లెం రవీందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా నాయకుడు పారంద మహేశ్, నాయకులు అరుణ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు ఎర్ర ప్రేమ్, స్కూల్ కార స్పాండెంట్ భార్గవి, కాలనీ వాసులు మాధ వ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.