calender_icon.png 29 December, 2024 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యంతో విద్యను అభ్యసించాలి

02-12-2024 12:40:20 AM

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

సిరిసిల్ల, డిసెంబర్ 1 (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకు నూరి మురళి సూచించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలి పెల్లిలోని బాలుర వసతి గృహం, ఇల్లంతకుంట ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్ఠికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆకునూరి మురళి చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీఈవో రమేష్‌కుమార్, బీసీ సంక్షేమాధికారి రాజు మనోహర్ ఉన్నారు.